
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి కె.జి.యఫ్ చాప్టర్2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.