‘బ్రహ్మాస్త్ర’ నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!

Alia Bhatts Special Birthday Glimpse from Brahmastra Out,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Brahmastra latest Looks from the Movie,Alia Bhatt Look From Brahmastra Movie,Alia Bhatt Movies,Alia Upcoming Movies,Alia Upcming Movie in 2022, Alia Bhatt Next Projects,Brahmastra Telugu Movie Updates,Brahmastra Telugu Movie,Brahmastra Alia Bhatt movie,Alia Bhatt looks from Brahmastra Will revealed soon,Alia Bhatt looks From Brahmastra Will Revealed on Her Birthday, Ranbir Kapoor and Alia Bhatt in Brahmastra Movie,Alia Bhatt Birthday on 15th March,Alia Bhatt look From Brahmastra Movie Will Revealed on her Birthday,Brahmastra is a modern mythological film,Brahmastra 350 crores budget Movie, Karan Johar Producing the Movie Brahmastra,Brahmastra under the Banner of Dharma Productions,Brahmastra film created a new world named Astraverse,SS Rajamouli Promoting The Film Brahmastra,Brahmastra Releasing on 9th September Alia Bhatt RRR Movie,Alia Bhatt with Ramcharan In RRR Movie,RRR Movie Updates,RRR Movie Latest Movie News

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్‌, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఈసినిమా నుండి ఇటీవలే రణబీర్ కపూర్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో రణబీర్ కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా.. అలియా ఇషా పాత్రలో నటిస్తుంది.శివ జర్నీలో ఇషా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అలియా పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రేపు అంటే మార్చి 15న అలియా పుట్టినరోజు కావడంతో తనకు సంబంధించిన స్పెషల్ వీడియో రానుంది.

మరోవైపు ఈసినిమాకు భారీ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ లోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో మోడ్రన్ మైథాలజీ గా రూపొందుతుంది. ఈ నేపథ్యంలో ఈసినిమా రిలీజ్ లోపు మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. అందుకే పలు టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లు ప్లాన్ చేశారు. ఈరెండు నెలల్లో వీలైనంత ప్రమోషన్స్ చేసేలా చూస్తున్నారు.

కాగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే బహుబలి సినిమా నుండి కరణ్ కు అలానే రాజమౌళి మధ్య బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సౌత్ లో మాత్రం రాజమౌళి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =