శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“థ్యాంక్యూ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ మాస్కో లో జరిగింది. “థ్యాంక్యూ “మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కు కరోనా కారణంగా అంతరాయం కలగడం తో ఇటలీలో పూర్తి చేయాల్సిన కొన్ని సన్నివేశాలను దర్శకుడు మాస్కో లో తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, రాశీఖన్నా , ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు . తాజాగా “థ్యాంక్యూ “మూవీ షూటింగ్ పూర్తి అయినట్టు హీరో నాగచైతన్య తెలుపుతూ దర్శకుడు విక్రమ్ , సినిమాటోగ్రాఫర్ శ్రీరామ్ తో కలసి ఉన్న తన ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: