ఫుల్ స్వింగ్ లో సుధీర్ 15వ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

Sudheer 15th Movie First Schedule Wrapped Up

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా.. నటుడు, రచయిత హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కథలను చేసుకుంటూ వెళుతున్న సుధీర్ కోసం హర్ష వర్ధన్ కూడా ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమే తీసుకుంది. అయితే ఈ సినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ఇక వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈసినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. పీజీ విందా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =