
ట్యాగ్ · 8 కథనాలు


సుధీర్ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్

మామ మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్

సుధీర్ బాబు లిస్ట్ లో మరో సినిమా

కార్తికేయ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది

మామ మశ్చీంద్ర ట్రైలర్ రిలీజ్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ప్రస్తుతం డిఫరెంట్ కథతో వస్తున్నాడు. హర్షవర్థన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గెటప్స్ తో అలరించనున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే పనిలో ఉన్నారు.

సుధీర్ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీలో సుధీర్ బాబు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్ బాబు…

మామ మశ్చీంద్ర- వైరల్ విశాలాక్షి గా ఈషా రెబ్బా
ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. లావుగా ఉండే దుర్గా అనే పాత్రలో అలానే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో ఒక కథానాయికగా ఈషా రెబ్బ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈషాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు…

మామ మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ కు ఆసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. లావుగా ఉండే దుర్గా అనే పాత్రలో అలానే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

ఫుల్ స్వింగ్ లో సుధీర్ 15వ సినిమా.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా.. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తన కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ కథలను చేసుకుంటూ వెళుతున్న సుధీర్ కోసం హర్ష వర్ధన్ కూడా ఒక భిన్నమైన కథను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈసినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమే తీసుకుంది. అయితే ఈ సినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ఇక వెంటనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.

మాల్దీవ్స్ లో "అంటే .. సుందరానికీ !" షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో నాని కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ పేరుతో నటించడం విశేషం.

సుధీర్ బాబు లిస్ట్ లో మరో సినిమా
సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది అదే జోష్ తో వరుస సినిమాలను చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం అతను పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా చేస్తున్నాడు. ఈసినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ఇంద్రగంటి తో ‘సమ్మోహనం’, వి తరువాత “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు.

కార్తికేయ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో కార్తికేయకు లక్ మాత్రం బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ ఎక్స్ 100 సినిమా తరువాత కార్తికేయకు చెప్పుకోదగిన హిట్ మాత్రం రాలేదు. అయినా కూడా ఈహీరోకు సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అది కూడా ఏదో చిన్న చితకా బ్యానర్స్ ఏం కాదు.. ఇటీవలే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావు కబురు చల్లగా సినిమా చేశాడు. ఆ తర్వాత సుకుమార్ తో వెంటనే సినిమాను ప్రకటించాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు.