ఇటీవలే ఓటీటీలో ధనుష్ నటించిన కర్ణన్ సినిమాను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జగమే తంతిరమ్’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య నేడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈసినిమా మరి ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: ధనుష్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో, కలైఅరసన్, వడివుక్కరసు తదితరులు
రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫి: శ్రేయస్ కృష్ణ
నిర్మాత: శశికాంత్
కథ..
సురుళి (ధనుష్) తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఒక రౌడీ. ఇక్కడ హత్యలు.. సెటిల్మెంట్లు చేసుకుంటూ బతుకుతున్న అతను.. ఒక హత్య చేసిన అనంతరం నెల రోజుల పాటు ఊరు విడిచి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. అదే సమయంలో వేరే మాఫియా డాన్ కింద పని చేయాల్సి వస్తుంది. ఆ డాన్ కు బద్ధ శత్రువు అయిన శివదాస్ (జోజు జార్జ్) అక్రమ వ్యాపారాలు అన్నీ కొల్లగొడతాడు. కానీ దాని వల్లే సురుళి ఊహించని ప్రమాదంలో పడతాడు. తాను చేసింది పెద్ద తప్పని తెలుసుకుంటాడు.. ఆ స్థితిలో సురుళి ఏం చేశాడన్నది మిగతా కథ.
విశ్లేషణ..
ధనుష్ కు గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉన్న సినిమాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలానే చేశాడు. ‘పుదుపెట్టై’, ‘మారి’, ‘వడాచైన్నై’ సినిమాలతో లోకల్ డాన్‌గా ఆకట్టుకున్నాడునిజానికి ట్రైలర్ చూసినప్పుడు మామ రజినీ కాంత్ సినిమా కబాలి ఛాయలు కనిపించిన సంగతి తెలిసిందే. వేరే దేశంలో ఉన్న శరణార్ధుల కోసం పోరాడుతారు. ఈసినిమా కూడా అదే థీమ్ తో ఉంటుంది. అలాగే శరణార్ధుల నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అయితే శరణార్థుల కథకు గ్యాంగ్‌స్టర్ కోణాన్ని కలిపి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. కథ పాతదే అని కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. శరణార్థుల కష్టాలు, జాత్యహంకారం లాంటి పాయింట్స్ ను ప్రధానంగా తీసిన ఈసినిమాలో సురుళి లండన్ రావటం, డాన్‌గా మారడం తదితర సన్నివేశాలను ప్రథమార్ధంలో చూపిస్తాడు. శివదాస్ హత్య నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటి వరకూ డాన్‌గా తన స్వార్థం కోసం పని చేసిన సురులి తమిళ శరణార్థుల కష్టాలు తెలుసుకున్న తర్వాత వాళ్ల తరపున నిలబడి పోరాటం మొదలు పెడతాడు. ఇది సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు.
ఇక ధనుష్ గురించి.. తన నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. తనకు బాగా అలవాటు ఉన్న పాత్రనే కాబట్టి చాలా ఈజ్ తో చేసుకుంటూవెళ్లిపోయాడు. సురుళి పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు. చాలా వరకు వినోదాత్మకంగా సాగే పాత్రలో అతను హుషారుగా నటించాడు. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా ధనుష్ కు దీటుగా నటించిందని చెప్పొచ్చు. మలయాళ నటుడు జోజు జోసెఫ్.. కీలకమైన శివదాస్ పాత్రలో రాణించాడు. ఇతర నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లైటింగ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫ్రీ. శ్రేయస్ కృష్ణ తన కెమెరా పనితనంతో చాలా రిచ్ గా సన్నివేశాలను తీర్చిదిద్దారు. పాటలు సంగతి పక్కన పెడితే సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్ స్టర్ పాత్రలు నచ్చేవాళ్లకి.. ధనుష్ ఫ్యాన్స్ కు ఇది బాగా నచ్చుతుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: