#VT10 ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Varun Tej New Movie VT10 First Look Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej New Movie News,Varun Tej Latest Movie Updates,VT10,Varun Tej New Movie VT10 First Look,Varun Tej New Movie First Look Release Date,VT10 First Look Release Date,Varun Tej New Movie First Look Date Confirmed,Hero Varun Tej Upcoming Movie First Look

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు ఈ సినిమా గురించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు చిత్రయూనిట్ నుండి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ జనవరి 19న వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 1 =