
ట్యాగ్ · 5 కథనాలు


'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్
'శాకుంతలం' - శకుంతల లుక్ టెస్ట్ వర్కింగ్ సెషన్స్
"శాకుంతలం" మూవీ కి భారీ సెట్స్
"శాకుంతలం"మూవీ లో పూజాహెగ్డే ?

మోడరన్ విజువలైజేషన్ తో "శాకుంతలం"
దిల్ రాజు ప్రొడక్షన్స్ , గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీ లో అదితి బాలన్ , మోహన్ బాబు , ప్రకాష్ రాజ్ , కబీర్ దుహన్ సింగ్ , అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలిపారు. మా కావ్య నాయకి సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
'శాకుంతలం' - శకుంతల లుక్ టెస్ట్ వర్కింగ్ సెషన్స్
గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది శాకుంతలం. ఇన్ని ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారా అన్న ప్రశ్నకు ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు గుణశేఖర్. ఇక సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఎంత క్రియేటివిటీ తో ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఒక్కడు సినిమాలోనే చార్మినార్ సెట్ ఒకటి చాలు చెప్పుకోడానికి. ఇక రుద్రమదేవి సినిమాలో మరో అద్భుతం.
"శాకుంతలం" మూవీ కి భారీ సెట్స్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా “శాకుంతలం “మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం” లో స్టార్ హీరోయిన్ సమంత శకుంతల పాత్రకై ఎంపిక అయ్యారు. ప్రణయకావ్యం గా రూపొందుతున్న “శాకుంతలం “మూవీబ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మూవీ పై ఆసక్తి ని కలిగించింది. సమంత కథానాయికగా ఎంపిక అయిన మరో మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా , ప్రేక్షకులను ఆకట్టుకుంది. .
"శాకుంతలం"మూవీ లో పూజాహెగ్డే ?
టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "రాధేశ్యామ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటిస్తున్న పూజాహెగ్డే, దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ "కభీ ఈద్ కభీ దివాలీ ", రణ్ వీర్ సింగ్ "సర్కస్ " హిందీ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు పూజాహెగ్డే ఒక పౌరాణిక చిత్రానికి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.