కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Latest Reports

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

లైకా ప్రొడక్షన్స్ కు 'RRR' తమిళ్ హక్కులు

పెద్ద సినిమాలు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలిసిందే. ముందు నుండే సినిమా హక్కులు బుక్ చేసుకునే పనిలో వుంటారు. అందులో రాజమౌళి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్ లో అమ్మకాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు రావడంతో అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ త‌మిళ హ‌క్కులను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ద‌క్కించుకుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

కరోనా వల్ల దాదాపు 8నెలలు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీం ఈమధ్యే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు హెవీ వింటర్ లో కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేస్తూ తెలియచేస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఫైనల్ గా నైట్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపు 50రోజుల పాటు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నైట్స్ లో చలిలో ఇన్ని రోజులు చిత్రీకరణ చేశాం. ఫైనల్ గా ఈ షూట్ అయిపోయింది. త్వరలో మరో కొత్త…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు తమ సన్నిహితులకు కూడా ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం అలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' కోసం ఎదురుచూస్తున్నా అంటున్న హాలీవుడ్ బ్యూటీ..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

TFN Adminవాట్సాప్
Irish Model Alison Doody Joins The Second Schedule Of RRR Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' షూట్ లో అడుగుపెట్టిన లేడీ స్కాట్‌

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. అంతేకాదు వస్తూనే మంచి సర్పరైజ్ కూడా ఇచ్చారు. ఇన్ని రోజులు ఎన్టీఆర్ వీడియో కోసం ఎదురు చూడగా ఇటీవలే రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా.

TFN Adminవాట్సాప్

షేర్