ట్యాగ్ · 2 కథనాలు
ట్విట్టర్ లోకి అధికారికంగా వచ్చిన అనుష్క
సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కానీ ఇన్‌స్టాలో కానీ తమ సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతుంటారు. ఒక రకంగా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది.అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి నా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.
గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా 'నిశ్శబ్దం' ట్రైలర్
ఎంతో సస్పెన్స్ తర్వాత 'నిశ్శబ్దం' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా ట్రయిలర్ విడుదల చేసి యూనిట్‌ను అభినందనలు తెలిపారు.