ట్యాగ్ · 2 కథనాలు
నిశ్శబ్ధం పై ప్రజలకు అనుష్క మెసేజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్దం " అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్స్ లో శిక్షణ తీసుకున్నారు. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న "నిశ్శబ్దం " మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా 'నిశ్శబ్దం' ట్రైలర్
ఎంతో సస్పెన్స్ తర్వాత 'నిశ్శబ్దం' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా ట్రయిలర్ విడుదల చేసి యూనిట్‌ను అభినందనలు తెలిపారు.