ట్యాగ్ · 4 కథనాలు
గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా 'నిశ్శబ్దం' ట్రైలర్
ఎంతో సస్పెన్స్ తర్వాత 'నిశ్శబ్దం' సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా ట్రయిలర్ విడుదల చేసి యూనిట్‌ను అభినందనలు తెలిపారు.
అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన 'నిశ్శబ్దం'
మొత్తానికి ఇన్ని రోజుల సస్పెన్స్ తర్వాత నిశ్శబ్దం సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓటీటీ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లేవు కాబట్టే ఓటీటీ కే మొగ్గు చూపారు చిత్ర యూనిట్…
తల్లికి ప్రేమతో బర్త్ డే విషెస్..!
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో అనుష్క కాస్త భిన్నం అని చెప్పొచ్చు. సూపర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సిరీస్, భాగమతి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంది స్వీటీ. దీనితో ఈ మధ్య కొంచం సోషల్ మీడియాలో యాక్టీవ్ అయింది.
అనుష్క ఆరోగ్య సూత్రాలు
కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "అరుంధతి ", "బాహుబలి ", " రుద్రమదేవి ", "బాహుబలి 2", "భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "నిశ్శబ్దం " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.