బోయపాటి-బాలయ్య సినిమా మొదటి అప్ డేట్ ముహూర్తం ఫిక్స్..!

Director Boyapati Srinu and Nandamuri Balakrishna Hattrick Movie BB3 Murtham Fixed
Director Boyapati Srinu and Nandamuri Balakrishna Hattrick Movie BB3 Murtham Fixed

బాలకృష్ణ అభిమానులకు ఈ రోజు నుండే సర్ ప్రయిజ్ లు మొదలయ్యాయి. రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో తమ అభిమానహీరో సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఒక రోజు ముందు అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేష‌న‌ల్‌లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు చిత్ర యూనిట్. సాయంత్రం 7:09 నిమిషాల‌కు ఈ సినిమా నుండి అప్డేట్ ఉంటుందంటూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను చేసింది. అయితే ఎలాంటి అప్ డేట్ ఇవ్వబోతున్నారో చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాల‌కృష్ణ లుక్‌తోపాటు టైటిల్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. మరి చూద్దాం బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఎలాంటి సర్ ప్రయిజ్ ఇవ్వనున్నాడో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =