కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'పెంగ్విన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'పెంగ్విన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Penguin Movie Team Announce Movie Teaser Release Date

ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా వల్ల రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఆన్ లైన్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

ఇక ఇదిలా ఉండగా త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 8న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమాతో పాటు న‌రేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో 'మిస్ ఇండియా'.. అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్