రామ్ గోపాల్ వర్మ అసలు సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో కూడా ఎవరికీ తెలియదు కానీ ట్రైలర్ లు రిలీజ్ చేసి మాత్రం షాకిస్తాడు. అసలు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసాడు అన్న సందేహాలు రాకుండా ఉండదు. ఇప్పటికి చాలా సినిమాలే అలా చేయగా.. ఇప్పుడు మరో సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? ఎదో కాదు ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సినిమా. కరోనా పై వర్మ సినిమా తీస్తానని అప్పుడే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సడెన్ గా ఇప్పుడు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ట్రైలర్ ను బట్టి.. ఓ కుటుంబంలో కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్నది కథాంశంగా తెలుస్తోంది. ఇంట్లో ఓ అమ్మాయి జలుబు, దగ్గుతో బాధపడుతుంటే కుటుంబసభ్యులే ఆమె పక్కన కూర్చునేందుకు జంకడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. మొత్తమ్మీద ఓ ఇంటికే పరిమితమైన కథతో వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని వర్మ థియేటర్లలో రిలీజ్ చేస్తాడా, లేక, ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తాడా? అన్నది చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: