
ట్యాగ్ · 6 కథనాలు

ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?

`వి`.. నాని మల్టీపుల్ హ్యాట్రిక్స్
చాలా గర్వంగా ఉంది - హీరో నాని
గోదావరి నేపథ్యంలో నాని, శివ చిత్రం?

తెలంగాణ యాస నేర్చుకుంటున్న 'న్యాచురల్ స్టార్'
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల వాయాదా పడగా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాని రాయలసీమ యాసలో మాట్లాడనున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?
నేచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు పోలీస్ పాత్రలో కనిపించిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నాని, దర్శకుడు శివ నిర్వాణ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసమే నాని ఖాకీ ధరించనున్నాడట. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ సందడి చేయనున్నారు. థమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలైలో విడుదల కానుందని సమాచారం.

`వి`.. నాని మల్టీపుల్ హ్యాట్రిక్స్
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా రూపొందుతున్న చిత్రం `వి`. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇందగ్రంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ కానుంది.
చాలా గర్వంగా ఉంది - హీరో నాని
కథానాయకుడిగా వరుస సినిమాలలో నటిస్తూనే తన అభిరుచికి తగిన సినిమాలు నిర్మించాలని హీరో నాని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. మొదటి ప్రయత్నం గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలలో సైకలాజికల్థ్రిల్లర్ "అ !" మూవీ ని నాని నిర్మించారు. "అ !" మూవీ విజయం సాధించింది. "అ !" మూవీ కి రంజిత్ మేకప్ మెన్ గా పనిచేశారు.
`మా అన్నయ్య`, `సంక్రాంతి` తరహాలో నాని చిత్రం?
`నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `టక్ జగదీష్`. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీకి ఎంటర్ టైనర్ కి థమన్ బాణీలను అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
గోదావరి నేపథ్యంలో నాని, శివ చిత్రం?
`నిన్ను కోరి` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. `పెళ్ళి చూపులు` ఫేమ్ రీతూ వర్మ నాయికగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.