ట్యాగ్ · 5 కథనాలు
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?

`వి`.. నాని మల్టీపుల్ హ్యాట్రిక్స్
నాని 'V' షూటింగ్ పూర్తి

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్
హీరో నాని రక్తదానం
తలసేమియా పేషేంట్స్ కు బ్లడ్ అవసరం చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ స్టాక్ తక్కువగా ఉంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో బ్లడ్ డొనేట్ చేయడానికి డోనర్స్ జంకుతున్నారు. ఈ సమయంలో హీరో నానితన భార్యతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడే వారికి ప్రేరణ గా నిలిచిన హీరో నానికి సెల్యూట్ అంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్వీట్ చేసింది.
ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ లో నేచురల్ స్టార్?
నేచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు పోలీస్ పాత్రలో కనిపించిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నాని, దర్శకుడు శివ నిర్వాణ మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసమే నాని ఖాకీ ధరించనున్నాడట. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ సందడి చేయనున్నారు. థమన్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలైలో విడుదల కానుందని సమాచారం.

`వి`.. నాని మల్టీపుల్ హ్యాట్రిక్స్
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా రూపొందుతున్న చిత్రం `వి`. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైదరీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇందగ్రంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ కానుంది.
నాని 'V' షూటింగ్ పూర్తి
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. గతకొద్ది రోజుల ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి తో పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయిందని నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.