సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటివరకూ జాను అనే వర్కింగ్ టైటిల్ తోనే ప్రచారంలో వుంది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను మార్చే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఎందుకంటే… జాను టైటిల్ ను 96 రీమేక్ కు పెట్టుకున్నారు. దీనితో ఈ సినిమాకు కొత్త టైటిల్ ను మార్చుకునే పనిలో పడ్డారు. మరి చూద్దాం ఏం టైటిల్ పెట్టుకుంటారో..
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: