‘సరిలేరు నీకెవ్వరు’ ప్లస్ పాయింట్స్ ఇవేనట..!

Sarileru Neekevvaru Movie Positives,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Highlights,Sarileru Neekevvaru Telugu Movie Highlights

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ ను చూస్తే సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కనిపిస్తుంది. ఇక ఖలేజా తరవాత మహేష్ ఆ రేంజ్ లో కామెడీ ఈ సినిమాలో చేసినట్టు కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ఇక ఈ సినిమాకు మొదటి నుండి పాజిటివ్ టాకే వినిపిస్తుంది. సెన్సార్ రిపోర్ట్ కూడా సినిమా అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం అని తెలిపినట్టు తెలుస్తుంది.

* ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయట.. కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ఒకటి రెండు కాదు.. ఏకంగా 39 నిమషాల పాటు వుండే ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అట. హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి.. హీరోయిన్ రష్మికను మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎత్తులుంటాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్, హీరోయిన్ ఫ్యామిలీ, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ మధ్య కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయట.

* ఈ చిత్రంతో ముగ్గురు నటులు రీ ఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్‌’ అని వెండి తెరమీద అలరించిన సంగీత కూడా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైన్ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్‌ చేసే అల్లరి హైలైట్‌ అవుతుందట. నిర్మాతగా మారి నటనకు దూరమైన బండ్ల గణేష్‌కు ఇది రీ ఎంట్రీ చిత్రమే.

* ఒక్కడు, దూకుడు, పోకిరి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్‌మేన్‌… చిత్రాల్లో మహేష్ – ప్రకాష్‌రాజ్‌ కాంబినేషన్‌ ఎంత వైవిధ్యంగా ఉంటుందో, ఈ చిత్రంలో అంతకు మించి ఉంటుందని టాక్‌.

* మహేష్, రష్మిక కాంబినేషన్.వీరిద్దరి కాంబినేషన్ సూపర్ గా వర్క్ అవుట్ అయిందట.

* ఈ కామెడీతో పాటు తమన్నా ఐటం సాంగ్ సినిమాకు మరో ప్లస్.

* మహేష్‌ – దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లాగే, ఈ చిత్రంలోనూ పాటలు హిట్‌ అయ్యాయి. ఇప్పటికే పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మహేష్‌ మండేస్‌ పేరుతో పాటలను రిలీజ్‌ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fourteen =