ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ’96’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for a blissful dose of love! The first look and title of Production No 34 starring #Sharwanand & @Samanthaprabhu2 will be announced at 10 am on January 7th…@SVC_Official #PremKumar @Govind_Vasantha #JMahendran @CinemaInMyGenes #SVC34 pic.twitter.com/GsvG6GT82Q
— Sri Venkateswara Creations (@SVC_official) January 6, 2020
ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.
మరి తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష ఈ సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: