ట్యాగ్ · 2 కథనాలు

ఫిబ్రవరి 7న `96` రీమేక్
శర్వా-సామ్ '96' రీమేక్ రాబోతున్న ఫస్ట్ లుక్, టైటిల్
ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ రీమేక్ కు కూడా తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

ఫిబ్రవరి 7న `96` రీమేక్
తమిళనాట ఘనవిజయం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `96`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా... `దిల్` రాజు నిర్మించాడు. కాగా...ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత `దిల్` రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. మరి... ప్రేమికుల దినోత్సవానికి వారం రోజుల ముందుగా రాబోతున్న ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.