ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!

These Movies To Hit Theatres On Earlier Announced Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News

మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో వచ్చిన వార్తలకు, ఉన్న కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. ఫైనల్ గా చెప్పిన డేట్ లకే సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో పెద్ద సందిగ్దత కొనసాగింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాను జనవరి11వ తేదీన… అల వైకుంఠపురములో సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. నిన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఫిక్స్ చేసిన డేట్ లకే సినిమాలు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరిలేరు నీకెవ్వరు మూవీ, అల వైకుంఠపురములో చిత్రాలు యధావిధిగా ముందుగా అనుకున్న విధంగా జనవరి 11 మరియు 12తేదీలలో విడుదల కానున్నట్టు ప్రకటించారు. అంతేకాదు దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలు కూడా ముందు అనుకున్న డేట్లలోనే రిలీజ్ అవుతున్నాయి. దర్బార్ జనవరి 9, ఎంత మంచివాడవురా జనవరి 15న రిలీజ్ కానున్నాయి.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =