
ట్యాగ్ · 3 కథనాలు

'పొన్నియన్ సెల్వన్' ఐశ్వర్య ద్విపాత్రాభినయం..?

అఫీషియల్.. 2022 లో పొన్నియన్ సెల్వన్ పార్ట్1
భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా రెండు పార్ట్ లుగా వస్తున్నట్టు రెండు రోజుల నుండి వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుంది. ఈనేపథ్యంలోనే నేడు చిత్రయూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘స్వర్ణయుగం వస్తుంది’ అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఖడ్గం, కవచం, అందులో పులి గర్జించినట్టుగా ఉన్న ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఇంకా అంచనాలు పెంచేస్తుంది. అంతేకాదు‘పి.ఎస్. 1’ 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
'పొన్నియన్ సెల్వన్' ఐశ్వర్య ద్విపాత్రాభినయం..?
ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా.. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

"పొన్నియిన్ సెల్వన్ " ఫస్ట్ లుక్ రిలీజ్
లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా "పొన్నియిన్ సెల్వన్ " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల "పొన్నియిన్ సెల్వన్ " ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, కీర్తి సురేష్, అమల పాల్ , జ్యోతిక ప్రధాన తారాగణం.