ఈ క్యాలెండర్ ఇయర్ మెగా కాంపౌండ్ యంగ్ హీరోస్ వరుణ్ తేజ్, సాయితేజ్ కి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే… ఈ ఇద్దరు కూడా రెండేసి సినిమాలతో పలకరించడమే కాకుండా ఆయా చిత్రాలతో ఘనవిజయాలను మూటగట్టుకున్నారు. `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్`తో వరుణ్ తేజ్ 2019లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటే… `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలో సాయితేజ్ కి మంచి విజయాలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… 2019 క్యాలెండర్ ఇయర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలచిన `ఎఫ్ 2`లో వరుణ్ ఓ హీరో కాగా… చివరి బ్లాక్ బస్టర్ మూవీ అయిన `ప్రతి రోజూ పండగే`లో సాయితేజ్ కథానాయకుడు కావడం విశేషం.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ తేజ్ ద్వయం ఒకే సంవత్సరం(2014)లో ఒకటిన్నర నెల గ్యాప్ లో తమ తొలి చిత్రాలతో సందడి చేశారు. కట్ చేస్తే… ఈ ఏడాదితో ఐదు వసంతాల చిత్రప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు. అలాగే, అర్ధ దశాబ్ద కెరీర్ ని పూర్తిచేసుకుంటున్న ఏడాదిలోనే ఒకే తీరున రెండేసి హిట్లు అందుకుని ముందుకు సాగారు.
2019లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మెగా హీరోలు… 2020లోనూ అదే పరంపరని కొనసాగించాలని ఆకాంక్షిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































