
ట్యాగ్ · 2 కథనాలు

పండగలను టార్గెట్ చేసిన థమన్

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ పేర్లే వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే.. దేవిని కూడా వెనక్కి నెట్టేసి తమన్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం పలు సినిమాలు తమన్ చేతిలో వున్నాయి.
పండగలను టార్గెట్ చేసిన థమన్
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ సంగీత దర్శకుడు థమన్... ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్కు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘ప్రతి రోజూ పండగే’, ‘అల వైకుంఠపురములో’. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మూడు వేర్వేరు పండుగలకి విడుదల కానున్నాయి.