ట్యాగ్ · 2 కథనాలు
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!
భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!
యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!
కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.