ట్యాగ్ · 3 కథనాలు

పండగలను టార్గెట్ చేసుకుంటున్న సూపర్ స్టార్

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి.

పండగలను టార్గెట్ చేసుకుంటున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా పండగలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో అలరించిన రజినీ... తన తదుపరి చిత్రాలను వచ్చే ఏడాది సంక్రాంతి, దీపావళికి టార్గెట్ చేసుకుంటున్నారు.

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
వరుస సినిమాలతో సందడి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్... ప్రస్తుతం `దర్బార్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు.