
ట్యాగ్ · 2 కథనాలు

మళ్ళీ ఆ హీరోతోనే సాహో డైరెక్టర్ సినిమా..?

సుజీత్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?
సక్సెస్ ఫుల్ మూవీ "రన్ రాజా రన్ " తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన సుజీత్, ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో "సాహో " మూవీ ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో తన రెండవ సినిమా గా రూపొందించారు. స్టైలిష్ మూవీ గా తెరకెక్కిన "సాహో " మూవీ మాస్ ప్రేక్షకులను అలరించి కమర్షియల్ గా విజయం సాధించింది. ఇప్పుడు సుజీత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ ని రూపొందించనున్నారని సమాచారం.
మళ్ళీ ఆ హీరోతోనే సాహో డైరెక్టర్ సినిమా..?
తన మొదటి సినిమా 'రన్ రాజా రన్' తోనే మంచి హిట్ కొట్టాడు సుజీత్. ఆ హిట్ తో ఏకంగా ప్రభాస్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి సినిమా అయిపోయేంతవరకూ వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా సాహో సినిమాను తెరకెక్కించాడు. ఇంత చిన్న వయసులోనే ఈ రేంజ్ లో సినిమా తీసిన సుజీత్ పై అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.