ట్యాగ్ · 2 కథనాలు
"RRR" మూవీ సాంగ్ కు స్పెషల్ సెట్
డివివి ఎంటర్ టైన్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో "రౌద్రం రణం రుధిరం " మూవీశరవేగంగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
`ఆర్ ఆర్ ఆర్` కోసం యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ సాంగ్?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా నృత్యాలకు పెట్టింది పేరు. అలాంటి ఈ డాన్సింగ్ స్టార్స్ కలసి ఓ సినిమాలో నటిస్తున్నారంటే... ఎవరైనా సరే కాంబినేషన్ డాన్స్ నంబర్‌ని ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. ఈ సంగతి.. చిత్ర రూపకర్త, దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళికి కూడా తెలియంది కాదు. అందుకే... తారక్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కోసం ఓ అదిరిపోయే డాన్స్ నంబర్‌ని ప్లాన్ చేశాడట జక్కన్న.