ట్యాగ్ · 5 కథనాలు

హిందీలో కూడా వస్తున్న #prabhas20
'జాన్' షూటింగ్ అప్ డేట్
నాకు భాషతో సంబంధం లేదు..!
కె.జి.యఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా..?
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. ఇప్పుడు సాహో హడావుడి కూడా అయిపోయింది. దీనితో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. విరామం తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు.
`ప్రభాస్ 20` కోసం రికార్డు స్థాయిలో రెట్రో సెట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 1970ల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ... ఇటలీ నేపథ్యంలో రూపొందుతోంది. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇ

హిందీలో కూడా వస్తున్న #prabhas20
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన 'సాహో' ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అందరిచేత 'సాహో' అనిపించుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో 200 పైగా కలెక్షన్స్ రాబట్టగా... హిందీలో 185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
'జాన్' షూటింగ్ అప్ డేట్
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక ఇన్ని రోజులు సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.
నాకు భాషతో సంబంధం లేదు..!
నాకు భాషతో నాకు సంబంధం లేదు. నటించడమే నా పని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. బాహుబలి, సాహో సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు . ఇక ఇటీవలే బాహుబలి ఘనత లండన్ లో వాసులు కూడా చూసారు. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో బాహుబలి సినిమాను ప్రదర్శించగా.. అక్కడ కూడా బాహుబలి భళా అనిపించుకుంది. ఇక ఈ ప్రత్యేక ప్రదర్శనకి నటులు అనుష్క, ప్రభాస్ ఇంకా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నిర్మాత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అని ప్రభాస్ ను అడుగగా.. మంచి స్క్రిప్ట్ దొరికితే హాలీవుడ్…