
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన 'సాహో' ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అందరిచేత 'సాహో' అనిపించుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో 200 పైగా కలెక్షన్స్ రాబట్టగా... హిందీలో 185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.