
రిలీజ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.