సినిమా వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయమూ సంచలన కారకమే. అందుకే ఇదిగో తోక అంటే అదిగో పులి అన్న చందంగా సినిమా వాళ్లను అల్లరి చేయడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు కొంతమంది జనం. 2017 లో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా సినిమా వాళ్లను మానసికంగా హింసించిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
12 మంది సినిమా ప్రముఖులను విచారణకు పిలిపించిన సందర్భంగా జరిగిన రచ్చను, మీడియా అత్యుత్సాహాన్ని చూసి జనం విస్తుపోయారు. ఆ విచారణ సమయంలో సినిమా వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యలు, ప్రసారం చేసిన కధనాలు చూసి జనం అసహ్యించుకున్నారు. మొత్తానికి తల వెంట్రుకలు, కాళ్ల గోర్లు సేకరించి 62 మంది మీద కేసులు పెట్టగా చివరికి ఇద్దరిని మాత్రం దోషులుగా పేర్కొంటూమిగిలిన 50 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం.
సినిమా వాళ్ళలో రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నందు, కెమెరామన్ శ్యామ్ కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఖయ్యుం ఉన్నారు.అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో జరిగిన ఆనాటి విచారణ ప్రక్రియ ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
ఒకవైపు విచారణ కొనసాగుతుండగా మీడియాలో సినిమా వాళ్ళ మీద ప్రత్యేక చర్చా కార్యక్రమాలు పెడితే ఎవడు పడితే వాడు నోటికి వచ్చినల్లా నోరు పారేసుకున్నారు. ప్రపంచంలోని మందు, డ్రగ్స్ అన్నీ సినిమా వాళ్లే తాగేసి తందనాలు ఆడేస్తున్నట్లుగాఅభివర్ణిస్తూ టీవీ చానళ్ల మైకుల్లో సొల్లు కక్కారు కొందరు కుహనా మేధావులు. కానీ ఈ రోజున జరిగింది ఏమిటి?
నిందితులైన సినిమా వాళ్ళు ఎవరు దోషులు కాదు అని తేలడంతో ఆ రోజు రెచ్చిపోయిన ఓవరాక్షన్ గాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?నిర్దాక్షిణ్యంగా ఆరోపణలు, నిందలు, విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ విర్రవీగినప్పుడుప్రతిఘటించలేక, దీటైన సమాధానం చెప్పలేక ఆరోజు సినిమా వాళ్ళు అనుభవించిన మనసిక క్షోభకు సరైన సమాధానం ఈ రోజు దొరికింది.
సినిమా వాళ్లలో నిందితులైన 12 మంది నిర్దోషులుగా తేలటం వ్యక్తిగతంగా వారికి ,వ్యవస్థాగతంగా చిత్రపరిశ్రమకు పెద్ద ఊరట.నిర్దాక్షిణ్యంగా ఆరోపణలు, నిందలు, విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ విర్రవీగినప్పుడు
ప్రతిఘటించలేక, దీటైన సమాధానం చెప్పలేక ఆరోజు సినిమా వాళ్ళు అనుభవించిన మనసిక క్షోభకు సరైన సమాధానం ఈ రోజు దొరికింది.సినిమా వాళ్లలో నిందితులైన 12 మంది నిర్దోషులుగా తేలటం వ్యక్తిగతంగా వారికి ,వ్యవస్థాగతంగా చిత్రపరిశ్రమకు పెద్ద ఊరట.ఇక ముందైనా సినిమా వాళ్ళు ఇలాంటి వివాదాలను నెత్తి మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: