ఒక వారం గ్యాప్ లో విడుదలైన ఇద్దరు హీరోల సినిమాలలో ఏది బెస్ట్? ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్? అన్న చర్చలో ఆసక్తి అధికంగా ఉంటుంది. నిజానికి ఇద్దరు వేరు వేరు హీరోల మధ్య పోటీ పెట్టి ఎవరు బెస్ట్ ? అనటం కరెక్ట్ కాదు… కానీ ఆ ఇద్దరి సినిమాల్లో, పాత్రల్లో, పరిస్థితుల్లో సామీప్యత ఉన్నప్పుడు రెండూ విజయవంతం అయినప్పుడు ఇలా సరదాగా ఒక పోల్ గేమ్ నిర్వహిస్తే ఇద్దరి అభిమానులు సరదాగా పాల్గొని ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈరోజు మీ ముందుకు ఒక సరదా పోల్ గేమ్ తెస్తుంది మీ ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్”.
ఆ రెండు సినిమాలు “మజిలీ – చిత్రలహరి” కాగా ఆ ఇద్దరు హీరోలు “నాగ చైతన్య – సాయి తేజ్”. సో…ఈ ఇద్దరు కాంటెంపరరీ హీరోల మధ్య, వారి సినిమాల మధ్య ఉన్న పోలికలు ఏమిటో చూద్దాం.
1) ఈ ఇద్దరూ కాంపౌండ్ హీరోలు కావటం విశేషం. నాగ చైతన్య అక్కినేని వారి మూడవ తరం నట వారసుడు కాగా , సాయి తేజ్ మెగా కాంపౌండ్ వారి మేనల్లుడు.
2) గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఇద్దరికీ మంచి హిట్ కావలసిన అవసరం ఉంది.
3) ఈ రెండు సినిమాలలో ఆ ఇద్దరూ పోషించినవి ఫ్రస్టేటెడ్ హీరో క్యారెక్టర్స్ కావటం కామన్ పాయింట్.
4) ఇద్దరూ పాత్రలోని ఫ్రస్ట్రేషన్ కు తగ్గట్టుగా గడ్డంతో నటించారు.
5) ఇద్దరికీ హీరోయిన్లతో స్పర్ధ ఏర్పడి క్లైమాక్స్ దాకా కంటిన్యూ అవుతుంది.
6) ఇద్దరూ ఫస్ట్ టైం bigger than the life క్యారెక్టర్స్ కు భిన్నంగా boy at the next door క్యారెక్టర్స్ చేశారు.
7) చివరికి ఇద్దరూ తమ కెరీర్ కు చాలా అవసరమైన సందర్భంలో హిట్ కొట్టారు.
ఇలాంటి మ్యాచింగ్ పాయింట్స్ తో వచ్చి విజయాలు సాధించిన ఈ రెండు సినిమాలలో,ఈ ఇద్దరు హీరోలలో మీ ఓటు ఏ సినిమాకి? మీ ఓటు ఏ హీరోకి? ఈ రెండు పాయింట్స్ కు రెండు సపరేట్ బ్యాలెట్ బాక్స్ లు పెట్టాం. కాబట్టి ఈ సినిమాల మీద కనక వర్షం కురిపిస్తున్నట్టే ఈ పోల్ గేమ్ లో ఓట్ల వర్షం కురిపించండి.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=dgl5sS1Pda4]