ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కంచె, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’.. ఇలా వరుస సినిమాల విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ‘వాల్మీకి’ అనే మరో వైవిధ్యమైన సినిమాలో నటించనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రారంభం నిన్న హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. వరుణ్ తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్ నివ్వగా, రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. ఈసినిమా పోస్టర్ ను కూడా నిన్ననే రిలీజ్ చేశారు.
ఇక పోస్టర్ ను చూస్తుంటే ఫిలిం రీల్ మరియు తుపాకీ ఉండటంతో ఈసినిమా ఫిలింమేకర్ మరియు గ్యాంగ్ స్టర్ నేపథ్యం చుట్టూ తిరిగే కథలాగ అనిపిస్తోంది. అయితే ఈ సినిమా 2014 లో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన ‘జిగర్తాండ’కి రీమేక్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాట హిట్టైన ‘జిగర్తాండ’ రీమేక్‌లో విలన్ పాత్రలో వరుణ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
జిగర్తాండ లో నటించినందుకే విలన్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు బాబీ సింహా. మరి బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి వరుణ్ కూడా అదే రేంజ్ లో నటించి మెప్పిస్తాడా? మరి ఇది ఆ సినిమా రీమేక్ గానే శంకర్ తెరకెక్కిస్తారా లేక ఈ సినిమా ఢిపరెంట్ గా ఉంటుందా? ఆ కథకి ఈ కథకి సబంధం ఉందా? లేదా? అన్నది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ రీమేక్ అయినా హరీష్ శంకర్ మంచి టాలెంటెడ్ డైరక్టర్ కాబట్టి తనదైన శైలిలో తెరకెక్కిస్తే తప్పకుండా నచ్చుతుంది. చూద్దాం వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందో..?
కాగా ఈ వాల్మీకి చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: