ట్యాగ్ · 186 కథనాలు · పేజీ 10
హిట్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హిట్'
"HIT" మూవీ ట్రైలర్ రిలీజ్

'HIT' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

HIT కు అర్థం తెలిపిన హీరో విశ్వక్ సేన్
హిట్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్త కంటెంట్ ఉండి.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటే బొమ్మ హిట్టే. ఇప్పుడు అదే క్రైమ్ జోనర్ ను నమ్ముకొని మన ముందుకు వచ్చేశాడు 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లు గా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన సినిమా 'హిట్'. ఈ సినిమాకు మొదటినుండీ పాజిటివ్ బజ్ ఉంది. పోస్టర్ల దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ వరకూ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇటీవల స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి…

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హిట్'
ఫలక్‌నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్‌తో కలిసి నాని హిట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ ఓ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఇక ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రయిలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
"HIT" మూవీ ట్రైలర్ రిలీజ్
హీరో నాని సమర్పణ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్" ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "HIT "మూవీ ఫిబ్రవరి 28 వ తేదీ రిలీజ్ కానుంది. రుహానీ శర్మ కథానాయిక గా నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

'HIT' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు
శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఒకపక్క ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెంచాయి.

HIT కు అర్థం తెలిపిన హీరో విశ్వక్ సేన్
హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్ " ఫేమ్ విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ " HIT" ఫిబ్రవరి 28వ తేదీ రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించారు.