
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్

కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ రిలీజ్

'నవరస' టీజర్ రిలీజ్

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత
అనసూయ కోలీవుడ్ ఎంట్రీ

'నవరస' ట్రైలర్ రిలీజ్
ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది మణిరత్నం లాంటి డైరెక్టర్.. ఒకరు కాదు ఇద్దరు కాదు తమిళ్ లో ఉన్న పలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కించగా... ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో నటుడు ప్రత్యేక పాత్రలో నటించారు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కమల్-విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ స్టార్ట్
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. ఇప్పటికే కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇప్పుడు తాజాగా ఈరోజు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది.

కమల్ 'విక్రమ్' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఇటీవల వాయిదా పడి మళ్లీ రీసెంట్ గానే ప్రారంభమైంది. కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'నవరస' టీజర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం "నవరస "పేరుతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ కు తొమ్మిది మంది డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈఎపిసోడ్స్ లో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఎమోషన్ తో ఉంటుంది. రతీంద్రన్ ఆర్. ప్రసాద్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ ఇలా తొమ్మిది మంది దర్శకులు 9 భాగాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ…

వారితో నటించడం సరదాగా ఉంటుంది - సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ ద్వారా సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టారు. ఆవెబ్ సిరీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో శకుంతల గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.
అనసూయ కోలీవుడ్ ఎంట్రీ
అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. "క్షణం ", "రంగస్థలం ", "యాత్ర ", "కథనం "వంటి మూవీస్ తో అనసూయ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.