కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Vijay Deverakonda Latest Movie

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Tollywood Crazy Actor Vijay Deverakonda Sets New Record On Social Media,Telugu Filmnagar,Telugu Film News 2021,Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Vijay Deverakonda On Instagram,Vijay Deverakonda Instagram,Vijay Deverakon
సినిమా వార్తలు

సోషల్ మీడియాలో రౌడీహీరో కొత్త రికార్డ్..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Gets Upset As The Liger Movie Shoot Got Delayed Due To Covid19 Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay
సినిమా వార్తలు

'లైగర్' అప్ సెట్

విజయ్ దేవరకొండ సినిమా వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. 2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చింది.. ఆ తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ముంబైలో షూట్ వల్ల అక్కడి నుండి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా రావడంతో ముంబై వెళ్లారు షూట్ కోసం. కానీ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ లు మొదలవుతాయో కూడా తెలీదు…

TFN Adminవాట్సాప్
Check out the List Of Movies In Which Vijay Deverakonda Played Guest Roles,List Of Movies That Featured Cameo Appearances By Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood N
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్

సక్సెస్ ఫుల్ "నువ్విలా "మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు పరిచయం అయ్యి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రహ్మణ్యం "మూవీస్ లో నటించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు "మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ "గీత గోవిందం ", "టాక్సీవాలా "మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda Latest Picture In Ultra Cool Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverak
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ అల్ట్రా కూల్ ఫొటో

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్"లైగర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. "లైగర్ "మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ థాయ్ ల్యాండ్ లోమార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. హీరో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. "లైగర్ "మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Falcon Creations Team Gives Clarification That Vijay Deverakonda Movie With Sukumar Hasn’t Yet Shelved,Vijay Deverakonda Movie With Sukumar Hasn’t Yet Shelved,Telugu Filmnagar,Telugu Film News 2021,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

వేస‌విలో ప్రారంభం కానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివ నిర్వాణ చిత్రం?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో విజ‌య్ ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు... 2020 వేస‌వి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిసింది. వైజాగ్‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం... శివ నిర్వాణ ప్రీవియ‌స్ మూవీస్ `నిన్ను కోరి`, `మ‌జిలీ` త‌ర‌హాలో ఎమోష‌నల్ సాగుతుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్