
ట్యాగ్ · 7 కథనాలు


హెల్త్ పై విజయ్ ఆంటోని క్లారిటీ

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్

'విజయ రాఘవన్' ట్రైలర్ రిలీజ్
'బిచ్చగాడు' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!

బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుండి ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో వచ్చి బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను అందించింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

హెల్త్ పై విజయ్ ఆంటోని క్లారిటీ
విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా మలేసియాలో షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే అక్కడ షూటింగ్ లో విజయ్ ఆంటోని గాయపడిన సంగతి కూడా విదితమే. ఇక ఇప్పుడు తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మలేషియా లో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో దవడ ఎముక మరియు ముక్కు కి జరుపుకున్న పెద్ద సర్జరీ పూర్తి చేసుకున్నానని.. ప్రస్తుతం…

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని తన సినిమాలతో తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అయితే బిచ్చగాడు తరువాత పలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా విజయ రాఘవన్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'విజయ రాఘవన్' ట్రైలర్ రిలీజ్
విజయ్ ఆంటోని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే బిచ్చగాడు సినిమా తరువాత మాత్రం తెలుగులో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
'బిచ్చగాడు' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అవుతుంది..!
విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వసూళ్లను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే వెల్లడించారు. “నాలుగు నెలల నుంచి సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాను. ప్రజంట్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీలో ఉంది. త్వరలోనే…
కరోనా ఎఫెక్ట్ - పారితోషికం తగ్గించుకున్న విజయ్ ఆంటోనీ..!
విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవలే విజయ్ ఆంటోనీ, యాక్షన్ హీరో అర్జున్ తో కలిసి నటించిన కిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేదు కానీ.. తమిళ్ లో మాత్రం ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.