హెల్త్ పై విజయ్ ఆంటోని క్లారిటీ

Vijay Antony Gave Clarity on his Health Condition,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Vijay Antony,Vijay Antony Latest News,Vijay Antony Health Condition Updates,Vijay Antony Health Condition Latest News

విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా మలేసియాలో షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే అక్కడ షూటింగ్ లో విజయ్ ఆంటోని గాయపడిన సంగతి కూడా విదితమే. ఇక ఇప్పుడు తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మలేషియా లో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో దవడ ఎముక మరియు ముక్కు కి జరుపుకున్న పెద్ద సర్జరీ పూర్తి చేసుకున్నానని.. ప్రస్తుతం నేను కోలుకుంటున్నా.. మీ అందరితో సాధ్యమైనంత త్వరగా మాట్లాడుతానని చెబుతూ తన హెల్త్ పై కీలక అప్డేట్ ని అందించాడు. దీంతో ఫ్యాన్స్ కూడా కాస్త ఊరట చెందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =