ట్యాగ్ · 6 కథనాలు

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
'ఉప్పెన' టీమ్ కు బన్నీ అభినందనలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
"ఉప్పెన " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12 వ తేదీరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింతో తెలుసు కదా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ డెబ్యూ హీరో ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ రాబట్టుకొని కొత్త రికార్డులు సృష్టించాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి…
'ఉప్పెన' టీమ్ కు బన్నీ అభినందనలు
ఈమధ్య మన హీరోలు ఏదైనా సినిమా బాగుంటే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై ప్రశంసలు కురింపించడం చూస్తూనే ఉన్నాం. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకడుగు ముందే ఉంటాడు. చిత్రటీమ్ ను పిలిపించి మరీ వారిని అభినందించడం అల్లు అర్జున్ కు అలవాటు. ఇక ఇప్పుడు తాజాగా ఉప్పెన టీమ్ ను కూడా అభినందించాడు బన్నీ. ఇన్ని రోజులు బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా హైద్రాబాద్ చేరుకున్న బన్నీకి పుష్ప నిర్మాతలు స్పెషల్ షో వేశారట.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఉప్పెన
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'ఉప్పెన'. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు. ఈ లోపు ఈ సినిమాకు నీ కళ్లు నీలి సముద్రం అన్న పాట కావాల్సినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా కోసం మంచి క్యూరియాసిటీతోనే ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దానికి ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ పెంచిన అంచనాలే కారణం. అంతేకాదు వర్సటైల్ యాక్టర్ విజయసేతుపతి నెగిటివ్ పాత్ర చేయడం కూడా ఒక కారణం. ఇంకా ఈ సినిమా రిలీజ్ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఎలాగూ సినిమా హిట్…
ఉప్పెన 'ధక్..ధక్..ధక్' సాంగ్ రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్ మార్క్‌కి తగ్గ సాంగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ధక్ ధక్ ధక్’ అనే పాటను రిలీజ్ చేశారు. నువ్వూ…
"ఉప్పెన " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న "ఉప్పెన"మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరో గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటించడం విశేషం.