
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 130


శివన్న 131.. బిగ్ అప్‌డేట్

ఘనంగా కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు

మీనాక్షి చేతిలో 6 సినిమాలు

హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్

పుష్ప2 రిలీజ్ తగ్గేదేలే.. మేకర్స్ క్లారిటీ

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త సినిమా

వెట్టైయాన్ రిలీజ్ పై తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

శివంభజే ట్రైలర్ రిలీజ్

ధనుష్ గారికి మేం పెద్ద ఫ్యాన్స్

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్

కన్నప్ప నుండి శరత్ కుమార్ రోల్ రివీల్

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'
ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.

శివన్న 131.. బిగ్ అప్‌డేట్
శాండల్‌వుడ్ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ (శివన్న) అభిమానులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఆయన తన 131వ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇటీవల, ప్రొడక్షన్ టీం శివన్న పుట్టినరోజున ఇంట్రడక్షన్ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివన్న డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‍కి చిత్ర యూనిట్ సిద్ధమైంది.

ఘనంగా కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు.

మీనాక్షి చేతిలో 6 సినిమాలు
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6సినిమాలు చేస్తుంది.ఇందులో దాదాపు అన్ని క్రేజీ ప్రాజెక్టులే వున్నాయి.ఈసినిమాల విషయానికి వస్తే…

హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్
ఉస్తాద్ రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.హనుమాన్ నిర్మాతలు ఈ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాదు కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషల రైట్స్ తోపాటు ఓవర్సీస్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.సినిమా మీద వున్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటు కు ఈరైట్స్ దక్కించుకున్నారు.

మనమే ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలమైంది. వరుస పరాజయాల తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈఏడాది మనమే అంటూ వచ్చేశాడు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్ తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్
స్టార్ట్ హీరో సూర్య ప్రస్తుతం తన 44వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నుండి తన బర్త్ డే సందర్భంగా నిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.సూర్య లుక్ ,స్వాగ్ ఆకట్టుకున్నాయి.గ్లింప్స్ చూస్తుంటే సూర్య నుండి చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుందనిపిస్తుంది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశాడు.ఓవరాల్ గా ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.

పుష్ప2 రిలీజ్ తగ్గేదేలే.. మేకర్స్ క్లారిటీ
ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప2 కూడా ఒక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కోసం కేవలం సౌత్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈమధ్య ఈసినిమాపై పలు వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా రిలీజ్ డేట్ పై. ముందు ఆగష్ట్ 15న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఆగష్ట్ నుండి ఏకంగా డిసెంబర్ కు వాయిదా వేశారు. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లానాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనితోపాటు ఇటీవలే షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తోన్న #BSS11 మూవీని పట్టాలెక్కించాడు సాయి శ్రీనివాస్. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.

వెట్టైయాన్ రిలీజ్ పై తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రజినీకాంత్ ఇప్పటికే తన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు.

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ అప్‌డేట్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒక్కడు స్పెషల్ షోస్
రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి చేరింది. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఒక్కడు’ ప్రస్తుతం రీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ తెలుగు డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోన్న హాలీవుడ్ మూవీ ట్రైలర్
మార్వెల్ మూవీ యూనీవర్స్ లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగించేందుకు రెడీ అయింది. డెడ్‌పూల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' చిత్రం వస్తోంది. ఈ చిత్రంలో వోల్వరిన్‌గా హ్యూ జాక్‌మెన్, డెడ్‌పూల్‌గా రయన్ రెనాల్డ్స్ కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్‌కు వరల్డ్ వైడ్ విపరీతంగా క్రేజ్ ఏర్పడింది.

శివంభజే ట్రైలర్ రిలీజ్
అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసింది. దీనికి తోడు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంగువ ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. టాలెండెట్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఎన్నో రోజులుగా సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ధనుష్ గారికి మేం పెద్ద ఫ్యాన్స్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

మిస్టర్ బచ్చన్ రీమేక్ అన్న నెటిజన్ కు హరీష్ రిప్లై
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు. ఇక ఇన్ని రోజులు సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను కూడా తాజాగా ప్రకటించారు మేకర్స్. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నప్ప నుండి శరత్ కుమార్ రోల్ రివీల్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. భారీ నిర్మాణంతో, భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ డిసెంబర్ లో ఈసినిమా రిలీజ్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు చిన్నగా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ సైతం దక్కింది.

ఎన్టీఆర్‌తో డాన్స్.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.