
ట్యాగ్ · 343 కథనాలు


భాగ్యనగరంలో ‘వెంకీమామ’

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ అప్డేట్

యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్

సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల

ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా ఎవరు టీజర్
కామ్రేడ్ గీతం విడుదల
విజయ్ ను బీట్ చేసిన నాని
దశ తిరిగింది
వెబ్ సిరీస్‌లో భూమిక

కొత్త తరహా పాత్రలో అఖిల్

హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?

కాప్పాన్ (బందోబస్త్ ) మూవీ ఆడియో రిలీజ్ డేట్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన కాప్పాన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ సెప్టెంబర్ 13 వ తేదీ విడుదల కానున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. హీరో సూర్య 37 వ మూవీ గా రూపొందిన కాప్పాన్ మూవీ సూర్య,KV ఆనంద్ కాంబినేషన్ లో మూడవది.

బిగ్ బాస్ 3 పోస్ట్ పోన్ కానుందా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 2 ను హీరో నాని రసవత్తరంగా నడిపారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి కింగ్ నాగార్జున హోస్ట్. జులై 21 వ తేదీ నుండి ప్రసారం కానుంది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్త సెక్సువల్ హెరాస్ మెంట్, మోసం గురించి ఆ షో నిర్మాతలపై ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితులలో బిగ్ బాస్ 3 ప్రోగ్రామ్ ను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా నాగార్జున నిర్మాతలను కోరారు.

భాగ్యనగరంలో ‘వెంకీమామ’
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని సమాచారం.

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ అప్డేట్
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టీలింగ్వల్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండేతో పాటు హాలీవుడ్ నటుడు మైఖెల్ మేడ్సన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’
గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా హిందీలోకి అనువదింపబడుతున్న పలు తెలుగు చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాటిలో సింహభాగం యాక్షన్ మూవీస్‌దే హవా కాగా... ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ కామెడీ ఎంటర్టైనర్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆ చిత్రమే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’. టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మిల్కీ బ్యూటీ తమన్నా, పంజాబీ భామ మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి పలు భారీ చిత్రాల నడుమ విడుదలై ఘన విజయం సాధించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి…

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్
అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే కరణ్ జోహార్ నిర్మాణంలో ‘కార్గిల్ గాళ్’లో నటిస్తున్న జాన్వి... ఆ తరువాత కూడా కరణ్ జోహార్ నిర్మాణంలోనే ‘దోస్తానా 2’లో కథానాయికగా నటించనుంది. అలాగే... కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హిస్టారికల్ డ్రామా ‘తఖ్త్’లోనూ కీలకపాత్ర పోషించనుంది జాన్వి. అంతేకాదు... కరణ్ జోహార్ నిర్మించనున్న మరో చిత్రంలోనూ జాన్వి నాయికగా నటించనుందని సమాచారం. బేజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో తన ఫస్ట్ మూవీ హీరో ఇషాన్…

సాహో మూవీ ఆగస్ట్ 30వతేదీ విడుదల
UV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెలుగు తమిళ హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కావాల్సివుంది. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీ కి మారింది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దుబాయ్ , అబుదాబి లో చిత్రీకరించిన యా క్షన్ సీన్స్ సాహో మూవీ కి హై లైట్. ఈమూవీ లోని సైకో సయ్యా సాంగ్ రిలీజయి ప్రేక్షకాదరణ పొందింది.

బ్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో `ఆర్ ఎక్స్ 100` సెన్సేషన్ సందడి
గత ఏడాది సంచలనం ‘ఆర్ ఎక్స్ 100’తో సంగీత దర్శకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్ భరద్వాజ్. ముఖ్యంగా `పిల్లా రా` పాటతో యువతరాన్ని ఉర్రూతలూగించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ తరువాత థ్రిల్లర్ ఫిలిమ్ ‘7’లో మరోసారి తన బాణీలతో అలరించాడు ఛైతన్. ‘ఆర్ ఎక్స్ 100’, `7`కి మధ్య దాదాపు 11 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ యువ సంగీత సంచలనం... ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లోనే రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. ఆ సినిమాలే `గుణ 369`, `మన్మథుడు 2`.

ఈసారి డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్న పూరీ
ఒకపక్క డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. మరోపక్క యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.. ఎలా ఉంటుంది ఇస్మార్ట్ శంకర్ లా ఉంటుంది అని చెప్పొచ్చు.. ఈసినిమా చూసిన తరువాత. పూరీ డైలాగ్స్ కు రామ్ మాస్ యాక్షన్ కలిసే ఇలా ఉంటుందా అని అర్ధమైంది అందరికీ. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. శంకర్ పాత్రలో రామ్ జీవించాడన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతే కాదు ఈసినిమాతో పూరీ, మణిశర్య ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్
మొత్తానికి జూన్ నెల మాత్రం వరుస సినిమా రిలీజ్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ ఒక్క జూన్ లోనే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జూన్ 26వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిలీజ్ అయిపోతే ఈ నెల వాటా అయిపోయినట్టే. వచ్చే నెల మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈరోజు ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈనెల విడుదలైన లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

గ్యాంగ్ లీడర్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుండగా... అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా ఎవరు టీజర్
వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చిత్రయూనిట్... రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. మొదట ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేద్దామనుకొని ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ హీరోయన్ సమంత చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
సరిలేరు నీకెవ్వరు - రిక్వెస్ట్ వల్లే తప్పుకున్న జగ్గూభాయ్..!
మహర్షి సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్... ఇప్పుడు అదే జోష్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కాశ్మీర్ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో జగపతిబాబు తప్పుకున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. మొదట తనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చెప్పిన సన్నివేశాలు.. తను షూటింగ్ లో పాల్గొన్న తరువాత సన్నివేశాలను మార్చడంతో జగపతి బాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక జగపతిబాబు ప్లేస్ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు.

కళ దైవదత్తమే అయినా దానికి శిక్షణ అవసరం- ఎస్ వి కృష్ణారెడ్డి
“నటన అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరం. అలాంటి నటనలో మంచి శిక్షణ ఇచ్చే "మయూఖ టాకీస్" యాక్టింగ్ స్కూల్ స్థాపించి మొదటి బ్యాచ్ కి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఈరోజు రెండవ బ్యాచ్ క్లాసులను ప్రారంభిస్తున్న నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు"- అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి. ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ లోని మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ వి కృష్ణారెడ్డి “ నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా…
కామ్రేడ్ గీతం విడుదల
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో చైతన్య ప్రసాద్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్…
విజయ్ ను బీట్ చేసిన నాని
విజయ్ ను నానీ బీట్ చేయడం ఏంటీ.. ఏ విషయంలో నాని విజయ్ ను బీట్ చేశాడు అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. ఇక తన బోల్డ్ యాటిట్యూడ్ తో.. వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.
దశ తిరిగింది
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది ఈ మూవీ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టి ని అదృష్ట దేవత వరించింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ ASSA తరువాత నవీన్ హీరోగా పిట్టగోడ మూవీ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందే…
వెబ్ సిరీస్‌లో భూమిక
హీరోయిన్ పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలకు షిప్ట్ అయిన నిన్నటి తరం అగ్ర కథానాయిక భూమికా చావ్లా... త్వరలో ఓ వెబ్ సిరీస్‌లో దర్శనమివ్వనుంది. `భ్రమ్` అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా... ఓ కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ వెబ్ సిరీస్... సిమ్లా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. సింహభాగం చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం. సంజయ్ సూరి, ఓంకార్ కపూర్, ఐజాజ్ ఖాన్ తదితరులు ఈ సిరీస్‌లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి... వెండితెరపై నటిగా…

కొత్త తరహా పాత్రలో అఖిల్
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి షెడ్యూల్లో భాగంగా... అఖిల్ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అఖిల్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... ఇందులో అఖిల్ ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడట. భావోద్వేగాలకు అవకాశమున్న ఆ…

హాకీ కోచ్‌గా మెగాస్టార్ చిరంజీవి?
తాజాగా తన కలల ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`ని పూర్తిచేసిన మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం తన 152వ చిత్రంపై దృష్టి సారించారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించనున్న ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు... రైతుగా, ఎన్నారైగా చిరు ఆ పాత్రల్లో కనిపిస్తాడని కూడా కథనాలు వచ్చాయి.