
ట్యాగ్ · 87 కథనాలు · పేజీ 5

తమిళ్ లో మరో భారీ ఆఫర్ కొట్టేసిన థమన్..!
`యన్టీఆర్ 30`కి థమన్ బాణీలు?
'వి' సినిమాలో థమన్ హ్యాండ్

గత ఏడాది `మజిలీ`.. ఈ ఏడాది`వి`..

'క్రాక్' సినిమాపై అంచనాలను పెంచుతున్న థమన్ - 'మాస్ రీలోడెడ్'
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఇటీవలే పలు రూమర్స్ వస్తుండగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసారు.
తమిళ్ లో మరో భారీ ఆఫర్ కొట్టేసిన థమన్..!
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు థమన్. ఈ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో ' సినిమా ఆడియోకు మంచిపేరు రావడంతో థమన్ కు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్" సోలో బతుకే సో బెటర్", రవితేజ మూవీ "క్రాక్", కీర్తి సురేష్ "మిస్ ఇండియా" , నాని "టక్ జగదీష్", వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. వాటితో పాటు వి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ ను అనుకుంటున్నారు.

"వకీల్ సాబ్ " లో పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జోడీగా శృతి హాసన్ ఎంపిక అయ్యారు. నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నారు.

మేలో వరుసగా మూడు వారాల పాటు థమన్ సందడి
వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న థమన్.. ఈ వేసవిలో వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీ ముఖ్యంగా.. మే నెలలో వరుసగా మూడు వారాల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పలకరించనున్నాడు.
`యన్టీఆర్ 30`కి థమన్ బాణీలు?
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే`, `అల వైకుంఠపురములో`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. మరీ ముఖ్యంగా.. `అల వైకుంఠపురములో`తో స్వరకర్తగా మరో స్థాయికి ఎదిగాడు ఈ టాలెంటెడ్ కంపోజర్. కట్ చేస్తే... `అల వైకుంఠపురములో` నిర్దేశకుడు, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా బాణీలు అందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడట థమన్.
'వి' సినిమాలో థమన్ హ్యాండ్
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. ఇప్పటీకే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేయడంతో పాటు.. టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

గత ఏడాది `మజిలీ`.. ఈ ఏడాది`వి`..
వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. కేవలం పాటల విషయంలోనే కాదు నేపథ్య సంగీతంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు ఈ స్వరచిచ్చరపిడుగు. అంతేకాదు.... అడపాదడపా వేరే స్వరకర్తలు పనిచేస్తున్న సినిమాలకు కూడా రీ-రికార్డింగ్ స్కోర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.