
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 167


రాఘవ లారెన్స్ రుద్రుడు మూవీ అప్ డేట్

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్


శాకుంతలం రిలీజ్ డేట్ ఖరారు

ఏజెంట్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

రాఘవ లారెన్స్ రుద్రుడు మూవీ అప్ డేట్
డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరుగా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్, అధికారం, జిగర్తాండ 2, చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు…

రిలీజ్ అయిన అమిగోస్ మూవీ కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్
నటుడు, నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసార మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. బ్లాక్ బస్టర్ బింబిసార మూవీ సీక్వెల్ బింబిసార 2 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్, డెవిల్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వాల్తేరు వీరయ్య నీకేమో అందం ఎక్కువ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వరల్డ్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కై రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం (RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం…

ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ వచ్చింది లేదు. తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ అయితే చాలా కూల్ గా ఉంది.

శాకుంతలం రిలీజ్ డేట్ ఖరారు
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటూ వెళుతుంది. రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.