ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 58
ఒకే నెలలో రాశీఖన్నా ట్రిపుల్ ధమాకా

విజిల్ మూవీ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’కి 28 ఏళ్ళు
మైత్రీ నుండి వస్తున్న ‘మత్తు వదరలారా’
సన్నీ లియోన్ తో ఛాన్స్ కొట్టేసిన నవదీప్
రజినీ సినిమాలో 'మహానటి'..?
తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్

ప్రభుదేవా సినిమాతో శ్రీకాంత్ చిన్న కొడుకు ఎంట్రీ

మిస్ ఇండియా మూవీ సాంగ్ టీజర్ రిలీజ్

తుపాకి రాముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

చియాన్ విక్రమ్ 58 మూవీ లో కన్నడ భామ
'పోకిరి' వల్లే నేను డిసైడ్ అయ్యా..!
స్టార్ హీరో అజిత్ కుమార్ తో 5వ సారి జంటగా ?
క్రిస్మస్ రిలీజ్ కన్ఫ్యూషన్ లో సినిమాలు

లక్కీ డేట్ కి వస్తున్న అల్లు అర్జున్
జోరు పెంచిన విక్టరీ వెంకటేష్
యన్టీఆర్ ఒకలా... రామ్ చరణ్ మరోలా...
మిక్కీ జే మేయర్... హ్యాట్రిక్‌కి వేళాయే
మెలోడీ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన మ్యూజిక్ కంపోజర్స్‌లో మిక్కీ జే మేయర్ ఒకరు. 14 ఏళ్ళుగా స్వరకర్తగా రాణిస్తున్న మిక్కీ... పలు విజయవంతమైన చిత్రాల్లో తనదైన `బాణీ` పలికించాడు. అలాగే పలు పురస్కారాలను తన కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే... ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు విజయాలను సొంతం చేసుకున్న మిక్కీ... ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఒకే నెలలో రాశీఖన్నా ట్రిపుల్ ధమాకా
`శ్రీనివాస కళ్యాణం` తరువాత కోలీవుడ్‌పై దృష్టి సారించిన రాశీఖన్నా... మళ్ళీ ఇప్పుడు వరుస తెలుగు చిత్రాలతో సందడి చేయనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆ చిత్రాలే... `వెంకీమామ`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `ప్రతి రోజూ పండగే`.

విజిల్ మూవీ ట్రైలర్ రిలీజ్
AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా ఫుట్ బాల్ క్రీడా నేపథ్యం లో రూపొందిన తమిళ మూవీ బిగిల్ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కాగా వివేక్, జాకీ ష్రాఫ్ , ఖదిర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. AR రెహమాన్ సంగీతం అందించారు.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ పొలిటికల్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి 7 ఏళ్ళు
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రూపొందిన ఫస్ట్ పొలిటికల్ బేస్డ్ ఫిల్మ్. జర్నలిస్ట్ గా టర్న్ అయిన `రాంబాబు` అనే ఓ మెకానిక్... అవినీతిపరులైన రాజకీయ నాయకులపై సాగించే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో పవన్ చెప్పిన పలు డైలాగ్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’కి 28 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అటువంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ‘రౌడీ అల్లుడు’ ఒకటి. కళ్యాణ్, ఆటో జానీగా చిరు ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శోభన, దివ్యభారతి కథానాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, జె.వి.సోమయాజులు, కెప్టెన్ రాజు, బ్రహ్మానందం, “ఐరన్ లెగ్” శాస్త్రి తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా... `డిస్కో` శాంతి ప్రత్యేక గీతంలో దర్శనమిచ్చింది.
మైత్రీ నుండి వస్తున్న ‘మత్తు వదరలారా’
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో అతి తక్కువ కాలంలోనే తమకంటూ టాప్ ప్రొడక్షన్ సంస్థగా ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక ఆ తర్వాత సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, 'డియర్ కామ్రేడ్' మూవీతో చిత్రాల రూపంలో వరుస ప్లాపుల ఎదురయ్యాయి. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్. అంతే కాదు ఒక పక్క పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరో పక్క కొత్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
సన్నీ లియోన్ తో ఛాన్స్ కొట్టేసిన నవదీప్
హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరో సరైన సినిమాలు నవదీప్ కు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్.. అల వైకుంఠపుములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
రజినీ సినిమాలో 'మహానటి'..?
తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఎలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. కుకునూర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యగా.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న తమిళ్ సినిమా టైటిల్ 'పెంగ్విన్' ను రిలీజ్ చేశారు. దానితో పాటు.. 'మిస్ ఇండియా' నుండి సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మంచు మనోజ్. అయితే మనోజ్ కు మాత్రం కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా పడలేదని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం గత కొద్దికాలం గా సినిమాలకు కూడా దూరంగానే ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే మనోజ్ వైవాహిక జీవితంపై కూడా కొద్ది రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే.. మనోజ్, తన భార్య విడాకులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మనోజ్ ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చాడు.

ప్రభుదేవా సినిమాతో శ్రీకాంత్ చిన్న కొడుకు ఎంట్రీ
విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఎన్నో సినిమాలు చేశారు శ్రీకాంత్. ఇక ఇప్పుడు తన కొడుకులను సెటిల్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే పెద్ద కొడుకు రోషన్ వెండితెరకు పరిచయమయ్యాడు. 'నిర్మలా కాన్వెంట్' సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు చిన్న కొడుకు రోహన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మిస్ ఇండియా మూవీ సాంగ్ టీజర్ రిలీజ్
మహేష్ S కోనేరు నిర్మాణ సారథ్యం లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేంద్ర నాథ్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా మిస్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, సుమంత్, పూజిత పొన్నాడ, కమల్ కామరాజ్, నదియా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S మ్యూజిక్ అందించారు.

తుపాకి రాముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
తన డైలాగ్స్ తో , మేనరిజం తో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిత్తిరి సత్తి ఇప్పుడు టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై బుల్లితెర నటుడు బిత్తిరి సత్తి హీరోగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తుపాకి రాముడు అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియా, RS నందా, గౌతంరాజు, రవి ఆదేశ్ ముఖ్య పాత్రలలో నటించారు. టి.ప్రభాకర్ సంగీతం అందించారు.
ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ రమేష్ ప్రసాద్ సతీమణి కన్నుమూత
ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ (మల్టీప్లెక్స్, ప్రసాద్ లాబ్స్) అక్కినేని రమేష్ ప్రసాద్ సతీమణి అక్కినేని విజయలక్ష్మి (77) ఈ రోజు కన్నుమూశారు. గత రాత్రి గుండె పోటుకు గురై నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చియాన్ విక్రమ్ 58 మూవీ లో కన్నడ భామ
వయా కామ్ 18 స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్స్ పై స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా, సూపర్ హిట్ మూవీ ఇమైక్క నోడిగళ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రియా భవాని శంకర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకునే హీరో చియాన్ విక్రమ్ ఈ మూవీ లో 25 గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.
'పోకిరి' వల్లే నేను డిసైడ్ అయ్యా..!
తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫెవరెట్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని మనకు చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా టికెట్స్ కోసం ఒకప్పుడు లైన్లో వెయిట్ చేసే వాడినని చాలా సందర్భాల్లో చెప్పాడు విజయ్. ఇక తాజాగా తాను సినిమాల్లోకి రావడానికి కారణం మహేష్ సినిమా అని కూడా చెప్పాడు విజయ్.
స్టార్ హీరో అజిత్ కుమార్ తో 5వ సారి జంటగా ?
లేడీ సూపర్ స్టార్ నయనతార టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తోపాటు, కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్న నయనతార నటించిన మూవీస్ 2019 సంవత్సరంలో ఇప్పటివరకు 6 మూవీస్ రిలీజయ్యాయి.తమిళం లో విశ్వాసం, తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, మలయాళంలో లవ్ యాక్షన్ డ్రామా మూవీస్ ఘనవిజయం సాధించాయి. దళపతి విజయ్ తో నటించిన బిగిల్ దీపావళికి రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించిన దర్బార్ మూవీ జనవరి లో రిలీజ్ కానుంది.
క్రిస్మస్ రిలీజ్ కన్ఫ్యూషన్ లో సినిమాలు
దసరా సీజన్ అయిపోయింది.. ఈ సీజన్ లో రావాల్సిన సినిమాలు అన్నీ వచ్చేసాయి. ఇక ఈ ఏడాదికి మిగిలింది ఒక్క పండగే అది క్రిస్మస్. ఈ ఏడాది చివర్లో వచ్చే ఈ పండగకు పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ ఫెస్టివల్ కు డజను పైగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు ముందు క్రిస్మస్ కు రావడానికి ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నట్టు తెలుస్తుంది.

లక్కీ డేట్ కి వస్తున్న అల్లు అర్జున్
సంక్రాంతి సీజన్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఇప్పటివరకు రెండు చిత్రాలతో ముగ్గుల పండక్కి సందడి చేసిన బన్నీకి... రెండు సందర్భాల్లోనూ మంచి విజయాలే దక్కాయి. ఈ నేపథ్యంలో... `అల వైకుంఠపురములో`తో ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆసక్తికరమైన విషయమేమిటంటే... గత రెండు సందర్భాల్లో ఏ తేదికైతే బన్నీ చిత్రాలు విడుదలయ్యాయో... సరిగ్గా అదే తేదికి తన నెక్ట్స్ వెంచర్ కూడా రిలీజ్ కానుంది.
జోరు పెంచిన విక్టరీ వెంకటేష్
F 2 (ఫన్ &ఫ్రస్టేషన్ ) మూవీ ఘనవిజయం తరువాత విక్టరీ వెంకటేష్ సినిమాల జోరు పెంచారు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే 3మూవీస్ కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్, నాగ చైతన్య మల్టీ స్టారర్ వెంకీ మామ ముగింపు దశలో ఉండి రిలీజ్ కు సిద్ధం అవుతుంది. సూపర్ హిట్ పెళ్ళిచూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వ మూవీ కి వెంటేష్ ఓకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
యన్టీఆర్ ఒకలా... రామ్ చరణ్ మరోలా...
దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత... తెలుగునాట సిసలైన మల్టీస్టారర్ మూవీ వస్తోంది. అదే... `ఆర్ ఆర్ ఆర్`. ఒకే తరానికి చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు (యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్) కలసి నటిస్తున్న ఈ మాసివ్ మల్టీస్టారర్‌ని దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 జూలై 30న రాబోతోంది.