
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను- పూజాహెగ్డే

ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు

షూటింగ్ నిబంధనలు.. వ్యాక్సీన్ వేసుకుంటేనే

సినీ కార్మికులు , జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్
ఆ ఘనత మనవాళ్లదే ..!

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?
చిత్ర పరిశ్రమలో మరో కొత్త శాఖ

TFN@10 మిలియన్స్..!
ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను- పూజాహెగ్డే
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ "భాయిజాన్", రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం ”బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు
గత ఏడాది కరోనా వల్ల థియేటర్లు మొత్తం మూతపడిన సంగతి తెలిసిందే కదా.. ఈఏడాది ఎలాగోలా ఓపెన్ చేసినా కొద్దిరోజులు మాత్రమే ఆ సందడి సాగింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉదృతంగా మారడంతో థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ తీసినా కానీ థియేటర్ల ఓపెన్ చేయకూడదని అనుకున్నా కానీ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని కోరనా నిబంధనలు ప్రకారం థియేటర్లు ఓపెన్ చేసుకోడానికి అనుమతులు ఇచ్చారు.

షూటింగ్ నిబంధనలు.. వ్యాక్సీన్ వేసుకుంటేనే
మళ్లీ చాలా గ్యాప్ తరువాత మేకర్స్ షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. ఒకరిద్దరు హీరోలు అప్పుడే షూటింగ్ లను మొదలుపెట్టారు కూడా. అయితే ఇంతకుముందు లాగ పరిస్థితులు లేవు కాబట్టి పూర్తి స్థాయిలో సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గిపోలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లు చేయాల్సిందే. ఇక ఈనేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆద్వర్యంలో సమావేశం జరగగా.. షూటింగ్ లు జరుపుకోడానికి కొన్ని నిబంధనలు విధించారు. వాటిలో పలు కీలక అంశాలను జోడించారు. షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంకా పలు అంశాలను జోడించారు.

సినీ కార్మికులు , జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి సినీ కార్మికులు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఆ సమయం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి , సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి, నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు అందజేసి వారిని ఆదుకున్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ఘనత మనవాళ్లదే ..!
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

'టాలీవుడ్ ' పేరు ఎక్కడినుండి వచ్చిందో తెలుసా..?
ప్రతి ఏడాది వేరు వేరు లాంగ్వేజస్ నుండి ఎన్నో సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ కాస్త పెద్దది.. ఆ తర్వాత మన టాలీవుడ్డే . అయితే దేశంలోనే ఎక్కువగా సినిమాలు తీసే ఇండస్ట్రీ ఒక్క టాలీవుడ్ మాత్రమే. ఒకప్పుడు హీరోలు తక్కువగా ఉన్నా ఒక్కో హీరో నుండి సుమారు ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇంకా పాత తరంకి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఏడాదికి 10కి పైన సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో హీరో ల సంఖ్య భారీగా పెరిగిపోయింది... చిన్న హీరోల నుండి బడా హీరోలు వరకు చాలామంది ఉన్నారు... దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర…
చిత్ర పరిశ్రమలో మరో కొత్త శాఖ
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడ్డ కార్మికులు పలు అవస్థలకు గురిఅవుతున్నారు. షూటింగ్స్ కు అనుమతి వచ్చినా పెద్ద సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడం లేదు. కరోనా కష్ట పరిస్థితులలో కళ తప్పిన చిత్ర పరిశ్రమ గాడిన పడేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంది. 24 విభాగాలుగా ఉన్న చిత్ర పరిశ్రమ మరో కొత్త విభాగానికి తెరతీసింది. అదే కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ . సురక్షిత వాతావరణంలో షూటింగ్ కొనసాగించేందుకు చిత్ర పరిశ్రమ కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంటుంది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ - ఆగిపోయిన 2000 కోట్ల టాలీవుడ్ బిజినెస్ ..!
కరోనా వల్ల ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్, మే నెలలో చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూత పడటంతో..సినిమా రిలీజ్ లు అన్ని ఆగిపోయాయి. అంతేనా ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడింది. ఎన్నో సినిమాలు దసరాకి.. దీపావళి కి షెడ్యూల్ ను పెట్టుకొని ఉన్నాయి. కానీ షూటింగ్ లు మధ్యలో ఆగిపోవడం వల్ల ఆ సినిమాలు కాస్త వచ్చే ఏడాదికి వెళ్లాయి. ఒక వేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ అయితే అప్పుడే తెరుచుకునే పరిస్థితులు అయితే లేవు. థియేటర్లు, మాల్స్ , పబ్లిక్ ఎక్కువగా వుండే ప్రదేశాలకు అనుమతి ఇస్తారని అనుకుకోవడం లేదు. ఎంతో కఠిన…

మీడియాకు సమాచారం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం
•నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయి •సినిమా చరిత్రను నిక్షిప్తం చేసే కమిటీ ఉంటే నా వంతు తోడ్పాటు అందిస్తా •‘మన సినిమాలు’ పుస్తకావిష్కరణ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు