కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Super Star Mahesh Babu New Movie News

ట్యాగ్ · 7 కథనాలు

Super Star Mahesh Babu Saves Life Of A Kid Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Super Star Mahesh Babu Latest News,Super Star Mahesh Babu New Movie
సినిమా వార్తలు

మరో ప్రాణం - మహేష్ @1019

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించిన సంగతి తెలిసిందే కదా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయికి పైగా చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు న్యూ లుక్

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మహేష్ బాబు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు కరోనా టైమ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏదైనా మంచిపని జరిగితే అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహేష్ బాబు ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియా లో తన డిస్ ప్లే , ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మీ త్యాగానికి మా సెల్యూట్..!

లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తూ చైనా వైఖరిపై మండిపడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌, నిఖిల్‌ సిద్దార్థ‌, అనిల్‌ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కు మహేష్ బర్త్ డే విషెస్..!

వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భరత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టాడు. అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యాల‌ను సాధించివ‌వే. ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాధ్యత ఉండక్కర్లా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరిగే పరిస్థితులపై కూడా స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా పలు అభిప్రాయాలతో పాటు.. సూచనలు, సలహాలు కూడా ఇస్తుంటారు. ఇప్పటికే కరోనా పై ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా పలు ట్వీట్ లు చేశారు. ఇక ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరోసారి మహేష్ బాబు తన అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Tweets To Support Cineworkers At This Crisis Moment
సినిమా వార్తలు

TFI వర్కర్స్ కై మహేష్ బాబు ట్వీట్

కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు విషమంగా తయారయ్యాయి. ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులు లాక్ డౌన్ విధించడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరోనా మహమ్మారి కట్టడి కై సినీ ప్రముఖులు పిఎమ్, సి ఎమ్ రిలీఫ్ ఫండ్స్ కు భారీగా విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. కోటి రూపాయలు విరాళమిచ్చిన మహేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్కర్స్ కై 25 లక్షలు విరాళం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Plans To Release His Next On Pokiri Release Date
రిలీజ్ అప్‌డేట్

'పోకిరి' రిలీజ్ డేట్ కి మహేష్ నెక్స్ట్ ఫిలిం రిలీజ్ ప్లాన్..!

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఏం సినిమా చేస్తాడా అన్నది మాత్రం గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే ముందు వంశీ పైడి పల్లి తోనే ఉంటుంది అన్నారు. కానీ వీరిద్దరి సినిమా ఇప్పట్లో లేదు. ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మహేష్ తర్వాత సినిమా పరుశురాం తో కానీ... వెంకీ కుడుముల తో కానీ ఉంటుంది. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. అంతేకాదు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్