
ట్యాగ్ · 6 కథనాలు


"బాలు కి ప్రేమతో "

ఎస్పీ బాలు కి 'మ్యూజికల్ ట్రిబ్యూట్'
మళ్లీ క్రిటికల్ కండీషన్ లో ఎస్పీ బాలు ఆరోగ్యం

విషమంగానే బాలు ఆరోగ్యం - ఎస్పీ చరణ్ భావోద్వేగం

విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి

చెన్నైలో ఓ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించిన లెజెండరీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ)కు మరణానంతరం అరుదైన గౌరవం లభించింది. 2020 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంగంబాక్కంలోని కామ్‌దార్ నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు ఖరారు చేసింది.

"బాలు కి ప్రేమతో "
లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 5 దశాబ్దాల సినీ కెరీర్ లో పలు భాషల సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. బాలు పుట్టిన రోజు (జూన్ 4)న సినీ మ్యూజిషియన్స్ యూనియన్ రవీంద్ర భారతిలో ‘బాలుకి ప్రేమతో’ అంటూ దాదాపు 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల ప్రోగ్రామ్ ను నిర్వహించనుంది. సినీ మ్యూజిషియన్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ బాలు గారంటే మా అందరికీ ప్రాణమనీ , మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి.అనీ , ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12గంటలపాటు సంగీత విభావరి చేస్తూ బాలు బర్త్‌డేని కన్నుల పండుగగా…

ఎస్పీ బాలు కి 'మ్యూజికల్ ట్రిబ్యూట్'
కరోనా వల్ల తెలుగు పరిశ్రమ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక అన్నింటికంటే పెద్ద నష్టం లెజెండరీ సింగర్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూయడం. ఎస్పీ బాలు లాంటి సింగర్ లేరు ఇక ముందు కూడా అలాంటి సింగర్ రావడం అనేది అసాధ్యం. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి.
మళ్లీ క్రిటికల్ కండీషన్ లో ఎస్పీ బాలు ఆరోగ్యం
కరోనా కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి ఆ తర్వాత ఆరోగ్యం కాస్త విషమించి అక్కడే హాస్పిటల్ లో వుంటూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. ఇక ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

విషమంగానే బాలు ఆరోగ్యం - ఎస్పీ చరణ్ భావోద్వేగం
గత కొద్దిరోజులుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా రావడంతో ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మొదట నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం తర్వాత క్షీణించినట్టు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ బాగానే వున్నారని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం బాలు తనయుడు చరణ్ చెప్పిన మాటలు వింటుంటే మాత్రం ఇంకా బాలు పరిస్థితి ప్రమాదకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి
ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన పలువురు నటులు, సింగర్స్, దర్శకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియాలో రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసి తెలిపారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం తాను చెన్నైలోని ఎంజీఎం అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.