ట్యాగ్ · 9 కథనాలు
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది
సౌత్ vs నార్త్ అన్నట్టు నేను మాట్లాడలేదు
వర్క్ మోడ్ స్టైల్ లో శృతి హాసన్
వైట్ డ్రెస్ లో ఏంజెల్ గా శృతి హాసన్

అక్టోబర్ లో "వకీల్ సాబ్ " షూటింగ్ లో శృతి హాసన్
ఆలోచనా స్రవంతి లో శృతి హాసన్
శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ ?
అందుకే నేను డ్రైవింగ్‌కు దూరం
ఏ విషయాన్ని అయినా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో శృతి హాసన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అంతేకాదు తనలోని లోపాలను కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా బయటకు చెప్పేస్తుంటుంది ఈ భామ. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరోసారి తనకున్న మరో లోపం ఏంటో చెప్పుకొచ్చింది. అదేంటంటే తనకు డ్రైవింగ్ అంటే అస్సలు ఇష్టముండదట.
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ లో చాలా విషయాలు తెలుసుకున్నా అంటుంది శృతి హాసన్.
సౌత్ vs నార్త్ అన్నట్టు నేను మాట్లాడలేదు
2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్లో ‘బెహెన్ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. మళ్లీ గ్యాప్ తర్వాత శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.
వర్క్ మోడ్ స్టైల్ లో శృతి హాసన్
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ కారణం గా 6నెలలపాటు ఇంటికే పరిమితం అయిన శృతి షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఉత్సాహం గా ఉన్నారు. శృతి ప్రస్తుతం "క్రాక్ "(తెలుగు ), "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పర కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ లో శృతి కథానాయిక గా ఎంపిక అయ్యారు.
వైట్ డ్రెస్ లో ఏంజెల్ గా శృతి హాసన్
యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ లో వర్కౌట్స్ , కుకింగ్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. శృతి ప్రస్తుతం హీరో రవితేజ "క్రాక్ ", విజయ్ సేతుపతి "లాభం "తమిళ మూవీ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీలో శృతి హాసన్ కథానాయిక గా ఎంపిక అయ్యారు.

అక్టోబర్ లో "వకీల్ సాబ్ " షూటింగ్ లో శృతి హాసన్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ "పింక్ " తెలుగు లో రీమేక్ అవుతుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. అంజలి , నివేద థామస్ , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఆలోచనా స్రవంతి లో శృతి హాసన్
మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషాచిత్రా లతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ మూవీ షూటింగ్స్ ప్రారంభానికై శృతి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తన కొత్త కొత్త ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న శృతి వెయిటింగ్ .. వెయిటింగ్ అంటూ తన కొత్త ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ ?
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ కానున్నారని సమాచారం. దర్శకుడు రామిన్ బహ్రానీ అంతర్జాతీయ వెబ్ సిరీస్ "ట్రెడ్ స్టోన్ " ను తెరకెక్కించనున్నారు. ఢిల్లీ లోని ఒక హోటల్ లో వెయిట్రెస్ గా పని చేస్తూ హత్యలు చేసే యువతిగా శృతి ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.
శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్
మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో శృతి హాసన్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. శృతి నటించిన "గబ్బర్ సింగ్ ", "బలుపు ", "ఎవడు ", రేసుగుర్రం ", "శ్రీమంతుడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. శృతి ప్రస్తుతం తెలుగు లో రవితేజ హీరోగా రూపొందుతున్న "క్రాక్ " , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం " (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు.